భారత్ న్యూస్ విజయవాడ…13 ఏళ్ళకే ఉద్యోగం….దేవాదాయశాఖ లో *పవన్ పంజా
*రికార్డ్ స్థాయిలో 13 సంవత్సరంలోనే ఉద్యోగం
*19 ఏళ్ళకే క్రమబద్దికరణ
*విచిత్రంగా ఏ గుడీలోను పని చేసిన ఆనవాళ్ళు లేవు
*ఇది సినిమా టైపులో ద్విపాత్రభినంతో రెగ్యూలర్ గా బడి,గుడి మానకుండ ఉద్యోగం
*చదువు…, ఉద్యోగంతో… ద్విపాత్రభినయం చేసినందుకు 22 లక్షల రుపాయలు చెల్లింపు
*చర్యలు నిల్
5రోజుల వ్యవధిలోనే 5 పేస్కేల్స్
*చర్యలు లేవు కాని పదోన్నాతిలో అక్రమంగా
*సినియారిటిలను వెనక్కి ఆక్రమంగా పవన్ కుమార్ కు ప్రమోషన్
*దేవాదాయ శాఖ ఘనత
విజయవాడ, ఆక్టోబర్ 6:గిన్నిస్ బుక్ వాళ్ళు కూడ ఈవార్త సంబ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. లిమ్కా రికార్డ్ కోసం లిమ్కా వాళ్ళు పడుతు లేస్తు లగెత్తుకోస్తారు.1993 13 సంవత్సరాల వయస్సులో 8 వ తరగతి క్వాలిఫికేషన్ తో 100 రుపాయల జీతంలో పేరు లేని ఉధ్యోగం లభించింది. బడి మానకుండ ,గుడి మానకుండ ఏక కాలంలో ద్విపాత్రాభినయంతో 1996లో ఉత్తీర్ణత సాధించారు.2001 లో డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించారు బడి,గుడి మానకుండ స్కూల్ కి వెళ్ళి పాస్ అయ్యారు.

ఏక కాలంలో ఉద్యోగం, చదవు సాద్యమేనా?

మనం సినిమాల్లో కూడ చూడలేము. కేవలం సినిమాల్లోనే దివ్య శక్తులతోనే ఏక కాలంలో బడి, గుడిలో ఉండగలరు. కాని వెల్లంకి పవన్ కుమార్ ఏక కాలంలో గుడిలో, బడిలో ఉన్నారు.ఇంత చేసినా నాటి సర్వీసు రికార్డుల్లో మాత్రమే సదరు పవన్ కుమార్ పేరు ఉంది.పవన్ కుమార్ మొదట చేరిన గుడిలో ఆయన పని చేసినట్లు కనీసం ఆనవాళ్ళు కూడ లేక పోవడం గమనించ దగ్గ విషయం .చేయని ఉధ్యోగానికి భవాని ముక్తేశ్వర స్వామి ఆలయం ఎకౌంట్ నుండి 2014 వ సంవత్సరం లో 14లక్షల రుపాయలు,2018లో 8 లక్షల రుపాయలు పాత బకాయిలు కింది ఆక్రమంగా పోందారు.ఆక్రమంగా వేదంతం రామచార్యులనే అర్చక స్వామి ట్రస్టీ పేరుతో విధుల్లోకి తీసుకున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.పవన్ కట్టు కథలపై దేవాదాయశాఖ ఆసిస్టేంట్ కమీషనర్ 2020 జూలై 4న వివేధిక సమర్పించారు. ఈ నివేదికలో వెల్లంకి పవన్ కుమార్ 13 వ సంవత్సరంలో ఏలా ఉధ్యోగంలో చేరారని ప్రశ్నించారు.ఏ దేవాలయంలో పని చేశారో కూడ నమోదు కాలేదని సర్వీసు రికార్డులు సృష్టించబడ్డాయని ఆ నివేధికలో తీవ్రంగా ఆక్షేపించారు.వెల్లంకి పవన్ కుమర్ నుండి 22 లక్షలు రికవరి చేయలని అంతేకాకుండా కేసు నమోదు చేయాలని ఆని నివేధికలో కమీషనర్ కు సూచించారు.అయితే నాలుగేళ్ళు గడిచినా ఇంత వరకు పవన్ కుమార్ పై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. నిజాయితిగా పని చేసే సినియర్ ఉధ్యోగులు పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా ఉధ్యోగం పొందిన వెల్లంకి పవన్ కుమార్ కు ప్రమోషన్ లిస్ట్ లో మొదటి పేరుగా ఉండటం దేవదాయ శాఖ అవినీతికి పరాకాష్టగా చెప్పవచ్చు. పవన్ కుమార్ కంటే సినియారిటిలోను,నిజాయిగా ఉన్న ఉధ్యోగులను కాదని ఏవిధంగా పవన్ కుమార్ కు ప్రమోషన్ లిస్ట్ లో మొదటి పేరు ఏలా చేరుస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.పవన్ కుమార్ 5 రోజుల వ్యవధిలోనే అక్రమంగా 5 పేస్కేల్స్ పొందటం గమనార్హం.వెల్లంకి పవన్ కుమార్ 13 సంవత్సరాలకే ఉద్యోగం సంపాదించిన వెల్లంకి పవన్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని,దేవాదాయ శాఖ నుండి అక్రమంగా పోందిన 22లక్షల రుపాయలను వసూలు చేయాలని ప్రమోషన్ లిస్ట్ నుండి తోలగించి చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ఉధ్యోగులు డిమాండ్ చేస్తున్నారు.