భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
ఏపీలో ఉత్తర అండమాన్ సముద్రం లో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ రోజు ఉదయం అల్ప పీడనం ఏర్పడిందని, పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయు గుండంగా మారి, 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కోంది.