భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,సినిమా థియేటర్లలో అక్రమ వసూళ్ళు

పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల మండలంలోని సినిమా థియేటర్లలో వీక్షకులనుండి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. వీక్షకులకు ఇచ్చే టిక్కెట్లు ఉన్న ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉచితంగా అనుమతించాలి. కానీ వాహనాల పార్కింగ్కు వీక్షకుల నుండి వసూలు చేస్తున్నారు. అలాగే లోపల తినుబండారాలు నాసిరకంతో ఉన్నవి అధిక ధరలతో వీక్షకులకు అమ్ముతున్నారు. ఇలా సినిమా థియేటర్ లోకి వెళ్లిన వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనిపై తాసిల్దారు ను వివరణ కోరగా తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.