భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,వాటాలిస్తారా? వ్యాపారం వదిలేస్తారా?…
కొన్ని నియోజకవర్గాల్లో మద్యం దుకాణాల లైసెన్సుదారులకు బెదిరింపులు…
‘గుడ్విల్ ఇచ్చేస్తాం.. లైసెన్సు ఇచ్చేసి, వెళ్లిపోండి’ అంటూ ఒత్తిళ్లు…*
లాటరీలో విజేతలుగా నిలిచిన వారితో బేరసారాలు…
తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు…
బెదిరింపులకు పాల్పడుతున్న వారి సమాచారం తెప్పించుకుంటున్న ప్రభుత్వం…
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లాటరీలో విజేతలుగా నిలిచి లైసెన్సులు దక్కించుకున్న కొంతమందికి కొన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, మద్యం సిండికేట్ల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి…
‘మా నియోజకవర్గ పరిధిలో వ్యాపారం చేయాలంటే పెట్టుబడి లేకుండా మాకు 20 శాతం వాటా ఇవ్వండి. లేదంటే ఇక్కడ వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాం..
అంటూ కొందరు నాయకులు వారి అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు…
‘ఎంతో కొంత గుడ్విల్ ఇచ్చేస్తాం. మీ లైసెన్సులు మాకు అప్పగించేసి వెళ్లిపోండి’ అంటూ మరికొందరు బేరాలు మొదలుపెట్టారు…
ప్రధానంగా పల్నాడు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, విజయవాడ, గుంటూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది…