.భారత్ న్యూస్ అమరావతి..భర్తకు గుండెపోటు రావడంతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ భార్య
Oct 11, 2024,
భర్తకు గుండెపోటు రావడంతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ భార్య
విమానం నడుపుతున్న భర్తకు సడెన్‌గా గుండెపోటు రావడంతో ఆయన భార్య స్వయంగా విమానాన్ని ల్యాండ్ చేసింది. అమెరికాలో ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎలియట్ ఆల్పర్(78) అనే వ్యక్తి తన సొంత విమానం నడుపుతుండగా అతడి భార్య పక్కన కూర్చుంది. ఇంతలో భర్తకు గుండెపోటు రావడంతో అచేతనంగా మారిపోయాడు. భార్యకు విమానం నడిపిన అనుభవం లేకున్నా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు ఆమె విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసింది.