భారత్ న్యూస్ విజయవాడ…దేశంలో ఆకలి కేకలు! ప్రపంచ సూచీలో 105వ స్థానంలో భారత్‌
సీరియస్‌ కేటగిరీలో దేశం పాక్‌, అఫ్ఘానిస్థాన్‌ వంటి 42 దేశాల సరసన చోటు
మన కంటే ఉత్తమ కేటగిరీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌
ఆకలి సూచీలో 105వ స్థానంలో భారత్‌
భారత్‌లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. 2024-ప్రపంచ ఆకలి సూచీలో దేశం 105వ స్థానం దక్కించుకుని ‘సీరియస్‌’ కేటగిరీలో ఉండడం గమనార్హం. ఈ కేటగిరీలో మొత్తం 42 దేశాలు ఉండగా భారత్‌తోపాటు పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ వంటివి ఉన్నాయి. అదేవిధంగా పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు భారత్‌ కంటే మెరుగైన కేటగిరీలో ఉండడం విశేషం. తాజాగా అంతర్జాతీయ మానవతావాద సంస్థలు ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్‌ఐ)ని అంచనా వేశాయి. పోషకాహార లోపం, చిన్నపిల్లల మరణాలు వంటివి ఆధారంగా చేసుకుని మొత్తం 127 దేశాల్లో పరిస్థితిని వెల్లడించాయి. ఈ జాబితాలో భారత్‌ 105 స్థానం దక్కించుకుంది. ‘‘27.3 స్కోరుతో భారత్‌ ఆకలి స్థాయిలో సీరియస్‌ కేటగిరీలో ఉంది’’ అని నివేదిక పీఠికలోనే పేర్కొనడం గమనార్హం. దేశంలో 13.7 మంది ప్రజలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు.