భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్…ఎవరెస్ట్ పై వందేళ్ల నాటి కాలు
హిమాలయాల్లో వందేళ్ల తర్వాత ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. 1924లో ఇంగ్లండ్కు చెందిన ఆండ్రూ కాన్న్ శాండీ ఇర్విన్ (22) మరో వ్యక్తితో కలిసి ఎవరెస్ట్ ఎక్కుతూ గల్లంతయ్యారు. ఎన్ని రోజులు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. గత నెలలో సెంట్రల్ రోంగ్ బుక్ గ్లేసియర్ వద్ద కొందరు ఓ కాలును గుర్తించారు. సాక్సులపై ‘ఏసీ ఇర్విన్’ అని రాసి ఉంది. ఇర్విన్ మునిమనవరాలు డీఎన్ఏతో పోల్చి చూడగా అతడి కాలేనని తేలింది.