..భారత్ న్యూస్ అమరావతి..వరద బాధితుల కోసం భారీగా విరాళాలు

లోకేష్ ను కలిసి చెక్కులు అందజేసిన ప్రముఖులు

అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పలువురు ప్రముఖులు శుక్రవారం మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.విజయకుమార్ రూ.1,27,34,809, చిలకలూరపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రూ. 20,36,116, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రూ.8,81,748, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రూ.4,65,726, వాసి రెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ తరపున వాసిరెడ్డి విద్యాసాగర్ రూ.10,00,000, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మ్యానేజ్మెంట్ అసోసియేషన్ తరపున 31,50,000, కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపున రూ.10,00,000, చెరుకూరి నారాయణ రావు రూ.10,116, కంచెర్లపల్లి సతీష్ రూ.1,00,000, నందిపాటి జోగారావు రూ.1,92,000 లు సిఎంఆర్ఎఫ్ చెక్కులను లోకేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు అందజేశారు.
**