భారత్ న్యూస్ విజయవాడ…రేపు : భూమి సమీపానికి భారీ గ్రహశకలం..

న్యూ ఢిల్లీ: ఈ నెల 28న ఓ భారీ గ్రహ శకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు. 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉండే ఈ గ్రహశకలం భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు.ఇది సెకనుకు 9.43 కి.మీ భూమి వైపుగా దూసుకొస్తోందని తెలిపారు.
దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.