అధికారులారా…!
ఇంకెన్నాళ్లు మాకి తిప్పలు…!!
-అలసత్వమా .. నిర్లక్ష్యమా..?
(భారత్ న్యూస్ :గుంతకల్లు)
ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు రికార్డుల నమోదుకు ఆయా అర్హులైన లబ్ధిదారుల కు శాపంగా మారిన వైనం.
గుంతకల్ పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధిత కార్యాలయాల కు వెళ్ళగా ఆన్ లైన్ సర్వర్ సమస్యగా ఉందంటూ వాకిలికి పోస్టర్లు దర్శనమిస్తుండటం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. సదరు పత్రాల నమోదుకు ఆయా కార్యాలయాల ఉన్నత అధికారుల కు విన్నవించిన సమస్య పరిష్కారం కు సరైన సమాధానం దొరకక లబ్ధిదారులుగా తాము ఎన్నో ఇక్కట్లకు పాలవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. గత కొన్నేళ్లుగా సదరు సమస్య ఉన్న పట్టించుకున్న అధికారులు లేరంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వం, ఇటు జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించి సదరు సమస్యల పై పరిష్కారం చూపాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.