భారత్ న్యూస్ విజయవాడ…తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

అంతకుముందు చిన్నారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.