..భారత్ న్యూస్ అమరావతి.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబయి వెళ్లనున్నారు. రతన్ టాటా పార్థివ దేహానికి వారు నివాళులర్పించనున్నారు.
మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ క్యాబినెట్ భేటీలో రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలపనున్నారు. అనంతరం అజెండాను వాయిదా వేయనున్నారు. సంతాపం తెలిపాక క్యాబినెట్ భేటీ ముగియనుంది. ఆ తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముంబయికి బయలుదేరనున్నారు. ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది..