..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 17న సెలవు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఈ పండుగను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం గతంలోనే ఈ నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వాల్మీకి మహాసేన నేతలు అక్టోబర్ 17న సెలవు దినంగా కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు..

ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది..