భారత్ న్యూస్ విజయవాడ…లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి.

దాదాపు 8 లంచ్ మోషన్ పిటిషన్లు ఫైల్ కావడంతో ఇన్ని ఎందుకు దాఖలవుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు.

తమ వాళ్లు కనిపించడం లేదని పిటిషనర్ల తరఫు లాయర్లు న్యాయమూర్తికి వివరించగా, మధ్యాహ్నం 2.30కు విచారిస్తామని జడ్జి తెలిపారు.

మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ఏజీ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు