భారత్ న్యూస్ విజయవాడ….ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ.

ఏపీలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పిన్నెల్లి.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరగనుంది. నెల్లూరు లో నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కాకాని.

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టు తీర్పు ఈ రోజు వెలువరించనుంది