ఏలూరు జిల్లా ముదినేపల్లి:::01\01\2025::::(భారత్ న్యూస్) ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన స్టేట్ టీ.డీ.సీ. డైరెక్టర్ కొడాలి వినోద్ ముదినేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ కొడాలి వినోదని మండల కార్యకర్తలు, అభిమానులు ఉదయమునుండి పెద్ద ఎత్తున పాల్గొని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేసి అభిమానాన్ని చాటుకున్నారు. కొడాలి వినోద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్,మోడీ, నాయకత్వములో రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ కి మహర్దశ పట్టబోతోందని,నిరుద్యోగ సమస్యలు లేకుండా ఉద్యోగావకాశాలు వస్తాయని, ఈ 2025 వ నూతన సంవత్సరం నుండి ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఆనందంగా కలసి మెలసి ఉండాలని కోరుకొన్నారు