దాములచెరువు పంచాయతీలో ఘనంగా పల్లెపండుగ కార్యక్రమం
పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ లోని పోలిశెట్టివారిపల్లి,మౌలాలిపేట,రాజీవ్ కాలనిలో డ్రైనేజీ కాలువలకు,సీసీ రోడ్లకు భూమి పూజ మంగళవారం పల్లెపండుగ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా,పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,ఎంపీటీసీ రాజ్యలక్ష్మి,సర్పంచ్,స్థానిక నాయకుల సమక్షంలో చేశారు.గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి మహిళలు హారతులు బట్టి ఘన స్వాగతం పలికారు.మౌలాలిపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి ముస్లిం మహిళలు హారతులు బట్టి ఘనస్వాగతం పలికారు.అలాగే రాజీవ్ కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యేకి మహిళలు హారతులు బట్టి,పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,ఎంపీటీసీ రాజ్యలక్ష్మిలు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన పల్లెపండుగ సభలో గ్రామ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు.గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యేకి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.వాటిపై స్పందించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు.జడ్పీ నిధులతో పోలిశెట్టివారిపల్లి గ్రామంలో ఇరవై లక్షలు,సీసీ రోడ్డుకు ఐదు లక్షలు,మౌలాలిపేటలో ఏడు లక్షల రూపాయలు,రాజీవ్ కాలనీలో ముప్పై నాలుగు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో డ్రైనేజ్,సీసీ రోడ్లకు భూమిపూజ చేశామని చెప్పారు.అలాగే రాజువ్ కాలనీకి ఆర్వో ప్లాంట్ కూడా మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు.రాజీవ్ కాలనీలో పల్లె పండుగ కార్యక్రమ ఏర్పాట్లు జింకలమిట్ట చంద్రశేఖర్ నిర్వహించి,డ్రైనేజీ పనులను చేపట్టారు.ఎలక్షన్ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పింఛను,పేద ప్రజలకు అన్నా క్యాంటీన్,ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు,భూ హక్కు చట్టం రద్దు వంటి హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లావని అన్నారు.అనంతరం పల్లెపండుగ వార్షికోత్సవ సభలో ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఈ.ఓ.పి.ఆర్.డి,ఈ.ఓలు యుగంధర్,మోతి,ఏపిఎం రామ్మోహన్,వివిధ శాఖల అధికారులు,టిడిపి మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు,కార్యదర్శి పల్గుణ కుమార్,మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్,మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి,టిడిపి నాయకులు కోటి,కుమార్ స్వామి నాయుడు,చిన్నబ్బనాయుడు,చలపతి నాయుడు,పురుషోత్తం నాయుడు,జనసేన పార్టీ నాయకులు తలారి గురునాథ్,జిల్లా ప్రధాన కార్యదర్శి నాజీర్,టిడిపి చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సావిత్రి,లింగయ్య నాయుడు,ఈశ్వర్ చౌదరి,సురేష్ చౌదరి,ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు,మహిళలు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.