.భారత్ న్యూస్ అమరావతి..తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్
Oct 20, 2024,
తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్
తిరుపతి నగరంలో ఓ బాలిక అదృశ్యమైందని ఈస్ట్ సీఐ తెలిపారు. కొర్లగుంట మారుతీ నగర్ కు చెందిన అక్సా క్వీన్ (14) శనివారం సాయంత్రం నుంచి కనబడటం లేదన్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఈస్ట్ పోలీసులు చెప్పారు. ఎవరికైనా పైఫొటోలోని బాలిక కనపడితే 9440796748కు సమాచారం అందించాలని తిరుపతి ఈస్ట్ పోలీసులు కోరారు.