.భారత్ న్యూస్ అమరావతి..తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 22న కోర్టు ముందు హాజరు కావాలని పవన్ కల్యాణ్‌తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, సమాచార శాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీ చేసింది. గత జనవరిలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అక్కడకు పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని పవన్ ఆధారాల్లేకుండా చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యా యవాది ఇమ్మనేని రామారావు పిటిషన్‌లో పేర్కొన్నారు.