భారత్ న్యూస్ విజయవాడ…యనమలకుదురులో గ్యాంగ్ వార్.. పోలీసుల దర్యాప్తు

AP: కృష్ణ జిల్లా యనమలకుదురులో ఈనెల 5న జరిగిన గ్యాంగ్ వార్కు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ వల్ల ఇరు వర్గాల యువకులు దాడులు చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 9మందిని అరెస్ట్ చేశామని, మరో వర్గంలోని యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నిందితుల్లో ఎక్కువమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించామన్నారు.