భారత్ న్యూస్.తిరుపతి :
ఇంధన సర్దుబాటు పేరిట విద్యుత్ చార్జీలు పెంచద్దు–సిపిఎం
ప్రజలపై భారాలు మోపద్ధు
విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం ఇంధన సర్దుబాటు పేరిట తీవ్రమైన భారాన్ని మోపుతున్న సందర్భంగా నేడు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి టి సుబ్రమణ్యం అధ్యక్షత వహించారు.
ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం 8,114 కోట్ల ట్రూ ఆప్ చార్జీల భారం మోపుతుందన్నారు.
మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు 2022 -23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన 8,114 కోట్ల రూపాయల (ఎఫ్ పి పి సీఏ )ఇంధన సర్దుబాటు చార్జీలు ప్రతిపాదనలను అనేక నెల క్రితమే విద్యుత్ నియంత్రణ మండలికి పంపించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ముందు వీటిపై ప్రజాభిప్రాయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని అన్నారు.
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన మండలి ట్రూ ఆప్ చార్జీలపై నిర్ణయం తీసుకోకుండా ఇప్పటివరకు కాలయాపన చేయడం సమంజసం కాదన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా హిందుజా సంస్థకు (హెచ్ఎంపిసిఎల్) 1234.68 కోట్లు విద్యుత్ సంస్థలు చెల్లించడం అక్రమమని అన్నారు.
ఈ భారాన్ని కూడా ప్రతిపాదనలో కలపడం శోచనీయమని ఈ అక్రమ చెల్లింపు పై మండలి ముందు సిపిఎం గతంలో పలుసార్లు లేవనెత్తినప్పటికీ దీనిపై చర్చించడానికి మండలి నిరాకరించిందన్నారు. నేడు ప్రతిపాదనలో ప్రజల కళ్ళు కప్పే రీతిలో పొందుపరచడం ఆక్షేపణీయంగా ఉందన్నారు.
పంపిణీ సంస్థలు ట్రూ అప్ ప్రతిపాదనపై సమాచారం ఇచ్చిన తర్వాత ఎనిమిది నెలలపాటు మండలి స్పందించకుండా కాలయాపన చేయడం గమనర్హంగా ఉందన్నారు. తీవ్ర జాప్యం అనంతరం నాలుగు త్రైమాస్కాల ప్రతిపాదనలపై నోటిఫికేషన్ విడుదల చేసి 12 పిటిషన్లపై ఒకేసారి హడావుడిగా విచారణ చేపట్టడం తగదు అన్నారు.
14 రోజుల్లో ఈ నెల 14వ తేదీ నాటికి అభ్యంతరాలు తెలపాలని మూడు రోజుల అనంతరం ఈనెల 18న బహిరంగ విచారణ చేస్తామని మండలి ప్రకటించడం అభ్యంతరకరంగా ఉందన్నారు. అభ్యంతరాలు తెలిపిన అనంతరం పంపిణీ సంస్థలు సమాధానాలు వివరణలు మూడు రోజుల్లో పంపటం వాటిని అధ్యయనం చేసి అభ్యంతరాలు తెలిపిన సంస్థలు పార్టీలు వక్తలు విచారణలో తమ అభిప్రాయాలు తెలపడం సంక్లిష్టమైన ప్రక్రియ.
ఈ నెలాఖరు నాటికి మండల చైర్మన్ టెక్నికల్ సభ్యుడు పదవి కాలం పూర్తవుతున్న సమయంలో హడావుడిగా ఎటువంటి విచారణ చేపట్టడం హేతుబద్దం కాదన్నారు.
నియంత్రణ మండలి నిబంధన స్ఫూర్తిగా భిన్నంగా ఏకపక్షంగా ఈవేళ 8,114 కోట్ల బారాలపై విచారణ ప్రక్రియ సాగించడం దానిని మొక్కుబడి తంతుగా మార్చడం తగదు అన్నారు.
ఈ విధానాలను మూర్ఖంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళతామంటే 2000 సంవత్సరంలో పది వామపక్ష పార్టీలు ఏ విధంగానైతే బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం జరిపిందో అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడుని గద్దె దింపడం కోసం అదే తరహాలో ఉద్యమించి తీరుతామని హెచ్చరించారు.
ధర్నా అనంతరం సిపిఎం బృందం సిఎండికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జయచంద్ర సాయి లక్ష్మి ఆర్ లక్ష్మి కే వేణుగోపాల్ పి బుజ్జి పి చిన్న ఎం నరేంద్ర జి చిన్న బాబు కే ఆర్ సుబ్రహ్మణ్యం రవి రాధాకృష్ణ శేషయ్య యుగంధర్ సుమన్ మోహన్ నాయుడు ప్రసాద్ రాము పార్థసారథి త్యాగరాజులు తదితరులు పాల్గొన్నారు.