భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో వీరికే ఉచిత సిలిండర్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత సిలిండర్ కు ప్రభుత్వం కొత్తగా
విధివిధానాలు ఖరారు చేసింది తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.

ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుండగా దీపావళి సందర్భంగా 31న తొలి ఉచిత సిలిండర్ డెలివరీ చేస్తామని తెలిపింది. కాగా ఆర్థికసంవత్సరంలో 4 నెలలకు ఒకటి చొప్పున మొత్తం 3
సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.