భారత్ న్యూస్ విజయవాడ…నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలులో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది.. కనీసం వందే భారత్‌లో వెళ్లినా 8 గంటలు పడుతుంది.

ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో అయితే మరో మూడు నుంచి నాలుగు గంటలు అదనం. కానీ కేవలం నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవచ్చు.

దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.

శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్‌ను రైల్వే శాఖ ఖరారు చేసింది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ లైన్‌ను ప్రతిపాదించారు. దీనిలో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు.

ఈ రైల్వే కారిడార్ విశాఖపట్నం నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వే తుది దశకు చేరుకుంది. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను నవంబర్‌లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

మొదటి సెమీ హైస్పీడ్ కారిడార్..

ఈ కారిడార్ పనులు మొదలైతే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ ఇదే కానుంది. ఈ రూట్‌లో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళికను రూపొందించారు.

ఈ రైలు మార్గం విమానాశ్రయాలకు అతి సమీపం నుంచి వెళ్లనుంది. విమాన ప్రయాణీకులు సెమీ హైస్పీడ్ రైళ్లలో తాము చేరుకోవల్సిన గమ్యానికి త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ సెమీ హై,