బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పశు ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ : డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, ( భారత్ న్యూస్ ) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం ఎటువంటి మానవ, పశు ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో 16 వ తేది ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సగటు వర్షపాతం సుమారు 40.40 mm నమోదైందని, అత్యధికంగా ఏర్పేడు మండలంలో @98.80 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 208 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 1183 మందిని 52 హ్యాబిటేషన్ల నుండి తరలించి పునరావస కేంద్రాలలో ఉంచి వారికి ఆహారము, త్రాగునీరు అవసరమైన మందులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెరువులు తెగిపోవడం లాంటివి ప్రస్తుతానికి జరగలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఐదువేల ఇసుక బస్తాలు మరియు 50 టిప్పర్లు అందుబాటులో ఉంచుకొని ఏదైనా చెరువులు కట్ట తెగిపోవడం, గండ్లు పడడం వంటివి ఏర్పడినప్పుడు వాటికి సత్వరమే మరమ్మత్తులు చేసే విధంగా అప్రమత్తంగా అధికారులను సమాయత్తం చేయడమైందని తెలిపారు. కండలేరు రిజర్వాయర్ 68 టిఎంసి ల నీటి నిలువ సామర్థ్యం ఉండగా అందులో ప్రస్తుతం 33.15 టీఎంసీల నీరు నిలువ ఉందని ఇన్ఫ్లో 5600 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అవుట్ ఫ్లో 345 క్యూసెక్కులుగా ఉన్నదని తెలిపారు. కాలంగి రిజర్వాయర్ 0.240 టీఎంసీల సామర్థ్యం కాగా 0.078 టీఎంసీల నీరు ప్రస్తుతం నిలువ ఉందని 1388 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా ఉన్నదని, అలాగే అరణియార్ ప్రాజెక్ట్ సామర్థ్యం 1.85 టిఎంసి కాగా అందులో ప్రస్తుతం 0.682 టిఎంసి ల నీటిని నిలువ ఉన్నదని 1660 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా ఉన్నదని తెలిపారు. పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించిన 143 రహదారులను వల్నరబుల్ రహదారులుగా గుర్తించడం జరిగిందని వాటిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారని, 107 జెసిబి లు, 53 పవర్ సా కట్టర్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, నాలుగు కాజ్వే లపై నీటి ప్రవాహం ఓవర్ ఫ్లో జరిగిందనీ తెలిపారు. నారు మడులు సుమారు 75 హెక్టార్లలో, 2518 హెక్టార్లలో నేరుగా విత్తిన వరి పంట నీట మునిగిందని తెలిపారు. 7 రోజుల్లో ప్రసవం కానున్న సుమారు 59 మంది గర్భిణీ స్త్రీ లను గుర్తించి వారికి డెలివరీకి ఇబ్బందులు కలగకుండా పి.హెచ్.సి, సి.హెచ్.సి కేంద్రాలకు ముందస్తుగా తరలించడం జరిగింది అని కలెక్టర్ తెలిపారు.