భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఏపీలో భారీగా పెరిగిన నిత్యవసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరల పై సామాన్య ప్రజలకు సరకులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయల కే అందించాలని మంత్రులు నాదెండ్ల మనోహర్ పయ్యావుల కేశువ, కింజరాపు
అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది.

రైతు బజార్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్లెట్ల ద్వారా సరకులును రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విక్రయించనుంది.