భారత్ న్యూస్ అమరావతి..శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీంతో శనివారం 4 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,18,464 క్యూసెక్కులు, సుకేసుల నుంచి 72,114 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీలుగా నమోదైంది.