..భారత్ న్యూస్ అమరావతి..స్పెయిన్‌లో వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
తూర్పు స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దాదాపుగా 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల్లో చాలా మంది గల్లంతయ్యారు. వరద ప్రవాహంలో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. భవనాలు, శిథిలాలు, కార్లపై కొందరు తలదాచుకున్నారు. మూడు రోజులు ఈ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.