భారత్ న్యూస్: అనంతపురం.ఆరైతులను వాగ్దాన వరదల్లో ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పై చర్యలు తీసుకోవాలి… జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి… ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య .
" రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని సమస్యల పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ రైతులను వాగ్దాల వరదల్లో ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదన్న విషయం కళ్లకు కనపడుతోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి.మల్లికార్జున అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ... తుంగభద్ర, పెన్నా, కృష్ణ వర్షాభావం ఎక్కువ అవ్వడంతో నీటి ప్రవాహం పరుగులు తీస్తోందన్నారు. వీటి ద్వారా వచ్చే లక్ష క్యూసెక్కుట్ల నీరు సముద్రపు పాలవుతోందన్నారు. ఈ నీటిని సముద్ర పాలు కాకుండా ఒడిసి పట్టుకోవడానికి ఏం మాత్రం ప్రయత్నం చేయలేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాలవలు వెడల్పు చేస్తామంటారే తప్ప అధికారంలో రాగానే ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. హెచ్.ఎల్.సి కెనాల్ కు సంబంధించి దాదాపు 86 కిలోమీటర్ల కాలువ వెడల్పు సంబంధించి 14 సం కాలం నుంచి ఏ మాత్రం నిధులు కేటాయించడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద మూడు లక్షల 50 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వాలు రైతాంగాన్ని మోసం చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీభవ పథకం కింద పంట సహాయం చేస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. జిల్లాలో 14 వేల మంది రైతులకు సరైన పత్రాలు లేవని 22 కోట్ల నిధులు ఇవ్వకుండా పోయిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు రానున్న బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పంటల బీమా ఇన్సూరెన్స్ కు సంబంధించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు విచ్చలవిడిగా ఇన్సూరెన్స్ చేస్తూ లాభాలు పొందుతున్నారన్నారు. పంటల బీమా ఇన్సూరెన్స్ కు సంబంధించి ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పత్తికి సంబంధించి గతంలో రూ. 10 వేలు మద్దతు ధర ఇవ్వడం జరిగిందని ప్రస్తుతం రూ 7,300 కు మద్దతు ధరకు పడిపోయిందన్నారు. దీనికి కూడా పంటలు బీమా లో చేర్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ... ప్రకృతి వైఫల్యం, పాలకుల శాపం వలన అనంత జిల్లా రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అన్నదాత పథకం కింద 20 రూపాయల పంట సహాయం కింద ఇస్తాను అని ప్రకటించి 2025 ఏప్రిల్ కు అమలు చేస్తామని చెప్పడం జరుగుతుందన్నారు. వర్షాభావంతో రైతాంగం ఎంతో నష్టపోయిందని ప్రస్తుతం ఏ అధికారులు కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. అనంత జిల్లాలో 111 చెరువులకు నీరు అందించాలన్నారు. జిల్లాలో రైతుల పండించుకోవడానికి మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని విరమించుకోవాలన్నారు. జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి టమోటా రైతులను ఆదుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగిందని హామీలు నెరవేర్చని పక్షంలో ఏపీ రైతు సంఘం సమస్యల కోసం పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,