భారత్ న్యూస్ విజయవాడ…నకిలీ విజిలెన్స్ లా దందా ముఠా అరెస్ట్ చేసిన పోలీస్…
నకిలీ ఐడి కార్డులు పెట్టుకున్న దుండగులు…
దుండగులు రూ. 2,50,000/-డిమాండ్..చేసిన వైనం 5 మంది అరెస్ట్…
(వారి వద్ద ఉన్న )
ఫార్చునర్ కార్ …
7 సెల్ ఫోన్లు…
10 రూ వేల నగదు స్వాధీనం…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్…
కర్నూలు
ఓర్వకల్
నకిలీ విజిలెన్స్ లా ముఠాను శుక్రవారం రాత్రి నన్నూరు సమీపంలో రాకమయూరి దగ్గర అరెస్టు పట్టుకున్నట్లు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ వెల్లడించారు. నన్నూరు గ్రామం రాగమయురికి చెందిన బెస్త గంగాధర్ వారి వద్ద పనిచేస్తున్న పింజారి పెద్ద దర్గాయాలను నేషనల్ క్రైమ్, నేషనల్ ఇన్విటిగేషన్, హ్యూమన్ రైస్ అని చెప్పి ఫార్చునర్ కార్ కి బోర్డులు వేసుకొని మీరు బియ్యం వ్యాపారం చేస్తున్నారని బిబెదిరించి దుండగులు 2,50,000 డిమాండ్ చేయగా ఫిర్యాదుదారులు ఇచ్చిన సమాచారం రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు ఓర్వకల్ ఎస్సై సునీల్ కుమార్ కలిసి 5 మందిని 1. పాలికట్టి మధుసూదన్ 2. శీలం అంకిరెడ్డి 3. పరదేవీ రవికుమార్ 4. కొరతల మహేష్ 5. ఆవుల మధు వీరిని పట్టుకుని వారి వద్ద ఫార్చునర్ వాహనం సెల్ ఫోన్లో 10,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలను ఇలాంటి మోసపోకుండా అప్రమత్తంగాఉండాలని ప్రజలకు సూచించారు. వారి వద్ద ఉన్న నగదు సెల్ఫోన్లో స్వాధీనం చేసుకునే వారిని అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులుపాల్గొన్నారు.