భారత్ న్యూస్ విజయవాడఏపీలో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఎప్పటివరకంటే

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి నవంబరు 11లోపు ఫీజు చెల్లించాలని డైరెక్టర్ దేవానంద్ రెడ్డి తెలిపారు.12వ తేదీ నుంచి నవంబరు 18వరకు చెల్లిస్తే రూ.50, 19 నుంచి 25 వరకు రూ.200, 26నుంచి నవంబరు 30 వరకు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు..