భారత్ న్యూస్ విజయవాడ…హైవేల పక్కనే EV ఛార్జింగ్ స్టేషన్లు

జాతీయ రహదారులను ఆనుకుని EV చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ (NHAI) నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన
‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024′ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధిచేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుంది.