భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్టీలు పెరగనున్నాయని మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడనుందని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
కర్నూలులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్దమైందన్నారు.
దీనిని నిరసిస్తూ.. ఈనెల 7న విజయవాడలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.