భారత్ న్యూస్ విజయవాడ…మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి
ఎంపీ వల్లభనేని బాలశౌరి
ఎంపీ లాడ్స్ నిధులు రూ.16.60 లక్షలతో నూతనంగా నిర్మించిన నాలుగు సీసీ రోడ్ల ప్రారంభం
మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మంగళవారం అవనిగడ్డ తొమ్మిదవ వార్డులో ఎంపీ లాడ్స్ నిధులు రూ.16.60 లక్షలతో నూతనంగా నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ నియోజవర్గంలో గ్రామాల మధ్య కనెక్టివిటీ వంతెనలు అన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మచిలీపట్నం రేపల్లె లైన్ సర్వేకు ఆర్డర్ వచ్చిందని, రానున్న ఒకటి రెండు ఏళ్లలో రైల్వే లైన్ సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు, ఎంపీపీ తుంగల సుమతి, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, పర్చూరి దుర్గాప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఉపాధ్యక్షులు తుంగల నరేష్, ఎంపీటీసీ బొప్పన భాను, మోపిదేవి మండల జనసేన అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు గాజుల శంకరరావు, కోసూరు శివాజీ, గాజుల పోతరాజు, చెన్నగిరి సత్యనారాయణ, బచ్చు రఘునాధ్, కొల్లూరి వాసు, మొగల్ మురాద్, బచ్చు నరసింహారావు, కర్రా సుధాకర్, మేడికొండ విజయ్, మత్తి శివపార్వతి, కమ్మిలి సాయి భార్గవ, బడే సుబ్బారావు, మండలి నరేష్, వేమూరి గోవర్ధన్, పాగోలు ఎంపీటీసీ మేకా బంగారుబాబు, మంగళాపురం సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.