భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అమరావతి :- స్పెషల్ ఫోకస్ ఆన్ దసరా – శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు 2024 అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి దసరా పండుగ విషయంలో మచిలీపట్నం ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది మచిలీపట్నం బందరు శక్తి పటాలు ఊరేగింపు ప్రపంచంలోనే రెండవ అరుదైన ఆచారం బెజవాడ విజయవాడ కు గ్రామాలుగా చిన్న చిన్న పల్లెటూరులుగా ఉన్న సమయంలో మచిలీపట్నంలో దసరా సందర్భంగా శక్తి పటాలు ఊరేగింపు గొప్ప అరుదైన ఆచారంగా నేటికీ కొనసాగుతోంది స్థానిక ఈడేపల్లిలోని కాళికాదేవి పరమ భక్తుడు రామకృష్ణ పరమహంస శిష్యుడు అని కథలు కథలుగా చెప్పుకొనే దాదా గారు అనే విశ్రాంత సైనిక ఉద్యోగి కుటుంబం 150 సంవత్సరాలకు పూర్వం వారి వంశ పరంపరంగా దసరా నవరాత్రులలో కాళికాదేవి ఉపాసన చేసేవారని ఒక దసరా రోజున కాళికాదేవి మహాకవి కాళిదాసుల దాదా గారికి ప్రత్యక్షమై నీవు కలకత్తా వెళ్లి కాళీమాత గుడిలోని ప్రధాన అర్చకుడు రామకృష్ణ పరమహంస వద్ద శిష్యునిగా ఉండాలని ఆజ్ఞాపించారని దానితో కలకత్తా వెళ్లిన దాదా గారు కాళికాదేవి ప్రసన్నతను పొంది రామకృష్ణ పరమహంస వివేకానంద దీవెనలతో కలకత్తాలో వందల సంవత్సరాలుగా కాళికాదేవి శక్తి పటాల విధానాన్ని బందరు మచిలీపట్నం తీసుకువచ్చి ఈడేపల్లిలో చిన్న పాకలో కాళికాదేవి విగ్రహాన్ని స్థాపించి దాదా గారి పీఠాన్ని స్థాపించి శక్తి పటాన్ని దసరా పది రోజుల కాలం మహాలయ అమావాస్య రోజు రాత్రి కాళికామాత తలను శక్తి పటాన్ని తయారుచేసి మొక్కుబడి ఉన్న భక్తునికి కట్టి స్మశానానికి తీసుకువెళ్లి మేకపోతులను బలి ఇచ్చి శక్తి పటానికి నల్ల ఎర్ర తాడోలతో ఆనను కట్టి మచిలీపట్నం అంతట ఉదయం నుండి రాత్రి వరకు ఊరేగించేవారని దశమి రోజు రాత్రికి శక్తి పటాన్ని మచిలీపట్నం అంతట ఊరేగించి రాత్రి 12 గంటల తర్వాత స్థానిక కోనేరు సెంటర్ కు తీసుకుని వెళ్లి అక్కడ జిమ్మీ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి దానిని ఖడ్గంతో ప్రాంత ప్రజలందరూ చిన్ని చిన్ని ముక్కలుగా నరికి రామాయణ భారత ఇతిహాస కథలలో జమ్మి చెట్టు కొమ్మను నరికిన విధానాన్ని గుర్తుచేస్తూ ఆ జమ్మి చెట్టు ఆకులను ముక్కలను మరలా విజయదశమి వచ్చేవరకు జమ్మి కొట్టేవరకు వారి పూజా మందిరాల్లో పూజించడం ద్వారా అన్ని పనులలోను విజయం కుటుంబంలో ఆరోగ్యం ధనం ఆనందాన్ని కలుగచేస్తాయని నమ్మేవారని రాను రాను కాలక్రమమైన శక్తి పటాలు సామాజిక వర్గాల బల ప్రదర్శన రాజకీయ లబ్ధి కోసం మచిలీపట్నంలోని అన్ని వార్డులు డివిజనులకు విస్తరించిపోయి రాజకీయ పార్టీలు గ్రూపుల పరంగా కూడా నేటికీ ఒకటికి గా వచ్చిన ఇడేపల్లి శక్తి పటం నేడు వందల శక్తి పటాలుగా విస్తరించిందని ఈ అరుదైన ఆచారాన్ని దర్శించడానికి దేశ విదేశాల నుండి వేల సంఖ్యలో భక్తులు మచిలీపట్నం బందరుకు వస్తుంటారు వారి వారి ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న శక్తి మందిరాలలో శక్తి పటాలకు తమ వంతుగా కానుకలు మొక్కుబడులు సమర్పించుకుంటున్నారు ఈ శక్తి పటం వద్ద మొక్కిన మొక్కులు కచ్చితంగా నెరవేరి తీరుతున్నాయని దేశ విదేశాల నుండి వచ్చిన వేలాదిమంది భక్తులు తమ నమ్మకాన్ని భక్తిశ్రద్ధలను వెలిబుచ్చుతున్నారు