త్వరలో తిరుపతి నుంచి కాట్పాడి రైల్వే డబుల్ లైన్ కోసం భూ సేకరణ…?

పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
పాకాల చిత్తూరు తిరుపతి ప్రయాణికుల సమస్యలపై స్పందించిన గుంతకల్ డివిజన్ రైల్వే డిఆర్ఎం ఎం. విజయ్ కుమార్ దగ్గరకు మీడియా ప్రతినిధులు ప్రజా ప్రతినిధి రిపోర్టర్ నాగభూషణం 99టీవీ రిపోర్టర్ ప్రతాప్ సమస్యలపై వివరణ కోరగా
పాకాల రైల్వేస్టేషన్ ను గుంతకల్ డివిజన్ రైల్వే డిఆర్ఎం విజయ్ కుమార్ స్పందించి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. పాకాల రైల్వేస్టేషన్ ను మోడ్రన్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దామని అన్నారు. కాట్పాడి-పాకాల మీదుగా తిరుపతి రైల్వే స్టేషన్ వరకు డబుల్ రైల్వే ట్రాక్ పనులు త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు, ప్రజల సౌకర్యార్థంగా పాకాల మీదుగా వెళ్లేటట్టు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పాకాల ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ దగ్గర బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరగా,డిఆర్ఎం పరిశీలిస్తామని అన్నారు. పరిశీలనలో భాగంగా
ప్రస్తుతం తిరుపతి కాట్పాడి రైల్వే డబుల్ లైన్ నిర్మాణం కోసం 45 కి, మీ.. చేపట్టడానికి పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్ పరిధిలో సుమారు 37 ఎకరాలు భూ సేకరణ చేపట్ట డానికి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారు వర్చువల్ విధానంలో మంగళవారం పాల్గొని సూచించగా ఆ మేరకుచర్యలు. తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జేసి శుభం బన్సల్ కూడా వారితోపాటు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్ జి. సెక్షన్ డిటి భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.