.భారత్ న్యూస్ హైదరాబాద్….Health Standards: ప్రైవేటు ఆస్పత్రుల ‘ఛీ’టింగ్‌!
రిజిస్టర్డ్‌ వైద్యులు, అనుమతులు లేకుండానే వైద్యం
కనీస ప్రమాణాలూ కరువు.. ప్రజారోగ్యంతో చెలగాటం
అగ్నిమాపక నిబంధనలను పట్టించుకోని నిర్లక్ష్యం
అల్లోపతివైద్యం చేసేస్తున్న ఆయుష్‌ వైద్యులు
టాస్క్‌ఫోర్స్‌ దాడులతో వెలుగులోకొచ్చిన వాస్తవాలు
హైదరాబాద్‌లో 10 శాతం ఆస్పత్రులకు నోటీసులు
సిద్దిపేట జిల్లాలో 35 దవాఖానాలకు జరిమానా
నిబంధనలు పాటించని 97 ఆస్పత్రుల మూసివేత
వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే, జర జాగ్రత్త.. మీరు వెళ్లే ఆస్పత్రిలో అర్హులైన వైద్యులున్నారో లేదో తెలుసుకుని వెళ్లండి! అక్కడ పరీక్షలు చేసే ల్యాబ్‌లో నిజంగా నిపుణులున్నారో లేదో వాకబు చేయండి. అసలు ఆ ఆస్పత్రిలు కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో ఆరా తీశాకే వెళ్లండి. లేకుంటే ఉన్న జబ్బుకు తోడు కొత్త రోగాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. రిజిస్టర్డ్‌ వైద్యులు లేకుండానే రోగులకు వైద్యం చేసేస్తున్నాయి.
కనీస ప్రమాణాలను పాటించకుండా.. క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నాయి. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై సర్కారు దృష్టి సారించింది. క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. ప్రైవేటు ఆస్పత్రులు క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టాన్ని ఫాలో అవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు వైద్య శాఖ ఈ ఏడాది జూన్‌లో ఏడు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను వేసింది