భారత్ న్యూస్ విజయవాడ…గ్రాడ్యుయేట్ లు ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దు…..
ఉమ్మడి కృష్ణా – గుంటూరు గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి! గ్రాడ్యుయేట్ ఎమ్మేల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోండి…..
పాత ఓటరు లిస్ట్ ఉండదు…….
అందరూ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలి……
గ్రాడ్యుయేట్ ఎమ్మేల్సీ ఎన్నికలకు ఫారమ్ 18 ద్వారా ఆఫ్లైన్ / ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు….
నవంబర్ 6 వరకు మాత్రమే. ఆన్లైన్లో గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవచ్చు…
ఏదైనా డిగ్రీ / Provisional /OD పూర్తి చేసి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా పరిదిలో నివసించే వారందరూ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకొనవచ్చును.
తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్ ఆదివారం 45వ డివిజన్ లో గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లుగా నమోదు కావాలని డివిజన్ లోని గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుస్తూ ఫారం 18 ను ఓటర్లకు అందజేశారు.ఈ సందర్భంగా పి. వి. ఫణి కుమార్ మీడియాతో మాట్లాడుతూ……
ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎన్నికలలో పట్టభద్రులు అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లుగా నమోదు కావాలని కోరారు.
ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన అహింసాత్మక ఆయుధమని పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటును నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
2021 సంవత్సరానికి ముందు డిగ్రీ, బీటెక్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలని కోరారు.
గ్రాడ్యుయేట్ల పాత ఓటర్ లిస్టు ఉండదని, నవంబరు ఆరో తేదీ లోపు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికి మాత్రమే గ్రాడ్యుయేట్ ఓటు వేసే అవకాశం ఉంటుంది అన్నారు.
పట్టభద్రులు అందరూ ఓటును నమోదు చేసుకునేలా 45వ డివిజన్ లో అందరికీ అవగాహన కల్పించడం జరుగుతోంది అన్నారు.
గ్రాడ్యుయేట్ లు ఓటు హక్కు పొందాలంటే ఈ క్రింద సూచించినవన్నీ అవసరమన్నారు.
ఏదైనా డిగ్రీ ఒరిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్ పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్, ఓటర్ కార్డ్ జత చేయాలి జిరాక్స్ కాపీలు అన్నిటి మీద గెజిటెడ్ ఆఫీసర్ చే సంతకం తీసుకోవలెను అని తెలిపారు.
01-11-2021లోపు డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఓటర్ గా నమోదుకు అర్హత*ఉంటుందన్నారు.