ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్
(భారత్ న్యూస్: గుంతకల్లు)
గుంతకల్లు పట్టణ ,మండల పరిధిలోని ఆయా వార్డుల గ్రామాల సమస్యల అర్జీలను ప్రజల ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. సోమవారం టిటిడి కళ్యాణమండపం లో ఏర్పాటుచేసిన ప్రభుత్వ ప్రజా సమస్యల వేదిక ఏర్పాటులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంతకల్లు పట్టణ, మండల ప్రాంతాల నుండి అనేకమంది ప్రజలు అర్జీదారులుగా తమ తమ సమస్యలపై వ్రాతపూర్వకంగా అర్జీలను అందజేశారు .తమకు గల సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు సంబంధిత అర్జీల పట్ల న్యాయం చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రధానంగా పట్టణంలోని పలు రాజకీయ శ్రేణులు, బాధితులు తమ అర్జీల ద్వారా గత కొన్నేళ్లగా జరిగిన లోపాలను తెలియజేస్తూ న్యాయం చేయాలని కలెక్టర్కు తమ తమ నివేదికల ద్వారా వేడుకొన్నారు. వారి పట్ల కలెక్టర్ స్పందిస్తూ ఆయా అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటి
పరిష్కారం కు పాటుపడాలని ఆదేశించారు. అందులో భాగంగా పలు అర్జీలు భూ ఆక్రమణలు, స్థానిక రెవెన్యూ అధికారులు చేసిన అలసత్వపు, అక్రమాల పై పలువురు అర్జీ దారులు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా అర్జీలపై జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికంగా పలువురు ప్రముఖులు సంభాషించుకోవడం కొసమెరుపు