నెట్టికంటుని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
(భారత్ న్యూస్ :గుంతకల్లు )
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానమును సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. ఆయన దేవస్థానం కు చేరుకోగా ఆలయ అధికార లు పర్యవేక్షణలో వేద పండితులు అర్చక బృందం సంయుక్తంగా ఆలయ సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు .తదుపరి ఆయనను శ్రీవారి మూల వరుల ను దర్శించడం లో భాగంగా ప్రాకార ప్రదక్షిణలు నిర్వహించి శ్రీవారిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. తదుపరి దేవాలయం సాంప్రదాయ బద్దంగా శ్రీవారి కానుకలుగా శేష వస్త్రం తో సత్కరించి శ్రీ వారి ప్రసాదాలను అందజేశారు.