..భారత్ న్యూస్ అమరావతి..నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే.!

కృష్ణా జిల్లా కంకిపాడులో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

కాగా ఆయన పర్యటన వివరాలను కార్యాలయం విడుదల చేసింది.

ఉదయం 10 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కంకిపాడుకి చేరుకుంటారు.

అనంతరం 10 నుంచి 11:30 వరకు కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

11:30కి కంకిపాడు నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.