..భారత్ న్యూస్ అమరావతి..శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డేటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్ కు పేరుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో డేటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలు, ప్రోత్సాహకాలు వివరించిన మంత్రి ఈక్వెనెక్స్ ఏపీకి రావాలని కోరారు…