భారత్ న్యూస్ విజయవాడ…స్పెయిన్ వరదల్లో 158కి చేరిన మృతుల సంఖ్య
స్పెయిన్‌లో వర్షాలు భారీ విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదలకు మృతుల సంఖ్య 158కి చేరింది. కేవలం వాలెన్సియాలోనే 155 మంది మరణించినట్లు గుర్తించారు. అనేక మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర బృందాలు ఇప్పటికే అనేక మందిని రక్షించగా.. కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి.