ఇంటర్ చదువుతున్న విద్యార్థిని దస్తగిరిమ్మ పెట్రోల్ దాడిలో మృతి చెందడం చాలా బాధాకరం : జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి

ఇటువంటి ఘటనలు మరలా జరక్కుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలి

పాకాల ( భారత్ న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం
కడప జిల్లా బద్వేల్ ఘటనలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని దస్తగిరిమ్మ పెట్రోల్ దాడిలో మృతి చెందడం చాలా బాధాకరమని జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి పేర్కొన్నారు.దాడికి కారణమైన విగ్నేష్ ను కఠినంగా శిక్షించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు. మహిళలపై దాడులు అరికట్టెందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన దాడులు మాత్రం ఆగలేదన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోరారు. పాకాల మండలంలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థినిలు ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు ముఖ్యంగా మహిళ విద్యార్థులు స్కూల్ యందు కాలేజీ యందు కాలేజీ వదిలిన తర్వాత కానీ మీరు తిరుగు పరిసర ప్రాంతాల ఎందుగాని ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని దాచకుండా ఇంటి యందు ముఖ్యముగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తెలియచేయండి అని తెలిపారు.