ఆసుపత్రి వైద్యసిబ్బందిపై మండిపడ్డ డిసిహెచ్ఎస్…
-భారత్ న్యూస్ కథనంపై స్పందన…
(భారత్ న్యూస్: గుంతకల్లు)
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి లోని వైద్య ఆరోగ్య సిబ్బంది తమ విధులలో ఆలసత్వం వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్ గుర్తించి ఆయా శాఖల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి రోగులతో సమీక్షించి వారికి అందుతున్న వైద్య ఆరోగ్య పరీక్షల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వైద్య ఆరోగ్య సిబ్బందిపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో పలు వైద్య ఆరోగ్య సేవలు నిర్వహించాల్సిన వైద్యులు, సిబ్బంది వారి విధులలో సమయపాలన చేష్టలపై ఆరా తీస్తూ తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం నిబంధన మేరకు సమయ పాలన పాటించాలంటూ వైద్య ఆరోగ్య సిబ్బందిని తనదైన శైలిలో హుకుం జారీ చేశారు . అలాగే ఆసుపత్రిలో వివిధ శాఖల వైద్య ఆరోగ్య పరీక్షల కేంద్రాలను సందర్శించి ఆయా పరికరాల సేవలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయా పరికరాలు పరిశీలనలోని నాణ్యత రాహిత్యాన్ని గుర్తించి బయో టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగపు సిబ్బందిని అప్రమత్తం చేయాలంటూ ఏవో రాంప్రసాద్ , సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ అజేందర్ రావులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలను ఆసుపత్రి ప్రాంగణంలోకి అనుమతించరాదని ఆయా వాహనాలను బయటకు తరలించాలంటూ హుకుం జారీ చేశారు. ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితులను రోగుల పట్ల జరుగుతున్న వైద్య సేవల తీరుపై జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపుతామన్నారు. అలాగే ఇటీవల భారత్ న్యూస్ కథనంలో భాగంగా జనన మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేయడంలో జరుగుతున్న జాప్యంపై సిబ్బంది నీ విచారించి వారి పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు. మరో మారు ఇదేవిధంగా సేవలుకొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి ఆవరణంలో ప్రత్యేకంగా క్షయవ్యాధి నివారణ కేంద్రం భవనం మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తించారు. సదరి విషయంలో ప్రజా పాలకులకు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సత్వర న్యాయమైన చర్యలు తన సిఫారసు చేస్తానన్నారు.