టీటీడీ “లగేజ్ కార్మికులకు” న్యాయం చేయండి.బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి.
టీటీడీ ఈవో శ్రీ శ్యామల రావు ఐఎఎస్ గారిని మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలో కార్మికులతో కలసి వినతి పత్రం సమర్పించిన బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి…
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తమ పరివారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ఈఓ శ్యామల రావు గారికి శ్రీవారి భక్తుల తరఫున నవీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు
తిరుమల (భారత్ న్యూస్) తిరుమల,తిరుపతి లోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు భద్రంగా చేరుస్తున్న సుమారు 350 మంది కార్మికులకు గత 15 సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలు కేవలం 10,000 మాత్రమే చెల్లిస్తున్నారని వారిని “శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్” లో విలీనం చేసి జీతాలు పెంచాలన్నారు!
తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీరు కపిలతీర్థం, మాల్వాడిగుండం ద్వారా వృధాగా పోతున్నాయని ఆ నీటిని నిల్వ ఉంచేలా “బాలాజీ రిజర్వాయర్” ను లేక “కపిలేశ్వర రిజర్వాయర్” ను నిర్మించాలన్నారు..
తిరుమల ఆలయంలో గత ప్రభుత్వంలో రద్దీ లేకపోయినా మహా లఘు, లఘు దర్శనాల పేరుతో సామాన్య భక్తులను జయ విజయుల నుంచే పంపించేస్తున్నారని ప్రతి భక్తున్ని గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేలా అనుమతించాలన్నారు!
తిరుమల తిరుపతి లోని టిటిడి వసతి గదుల కేటాయింపులో డిజిటల్, ఫోన్ పే, గూగుల్ పేమెంట్లు మాత్రమే అనుమతిస్తున్నారని అలా కాకుండా “క్యాష్ చెల్లింపులను” కూడా అనుమతించాలని కోరారు!
తిరుమల కొండపై ఉన్న మఠాలలో అద్దె గదులు, శుభకార్యాల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి ధరల పట్టికను ప్రతి మఠం ముందు display చేసేలా చర్యలు చేపట్టాలన్నారు!
శ్రీవారి సన్నిధిలో గత సంవత్సరం జరిగిన “ఫారిన్ కరెన్సీ”కేసును పునః సమీక్షించాలన్నారు!
శ్రీవారి నడకదారి భక్తుల భద్రతలో విషయంలో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో వన్య మృగాల బారిన పడకుండా అక్కడక్కడ “అండర్ పాస్” (వన్య మృగాలు రాకపోకలకు ఆటంకం కలగకుండా) ఏర్పాటు చేయాలన్నారు!
శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ 10,500 పై ఇద్దరిని అనుమతించాలని కోరారు
నవీన్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఈవో శ్రీ శ్యామల రావు గారు ప్రధాన అంశాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం శుభ పరిణామం అని ఈవో గారికి నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు..భారత్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్…