భారత్ న్యూస్ అమరావతి న్యూస్ ఎడిటర్ ఉదయ్ శంకర్ శర్మ,,బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్‌ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్‌లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతోపాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది.

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా .. ఉన్మాదిలా సోషల్ మీడియా వేదికగా వికృతంగా వ్యవహరించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరాచకాల గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నత స్థాయిలో బోరుగడ్డ కేసుపై పోలీస్ అధికారులు దృష్టి సారించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఎంతవరకు పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మరోవైపు అనిల్ కుమార్ బ్యాంక్ అకౌంట్లో కోట్లాది రూపాయల డబ్బులున్నాయి. తాడేపల్లి పెద్దల నుంచి అతినికి డబ్బులు వచ్చాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయా బ్యాంకుల ఖాతాలను పోలీసులు పరిశీలించనున్నారు. ప్రతిపక్ష నేతలపై పోస్టులు పెడుతూ.. తిడుతుండడంతో తాడేపల్లి పెద్దలు నెల నెలా కోట్లాది రూపాయలు పంపి.. న్యూస్ ఎడిటర్ ఉదయ్ శంకర్ శర్మ,