భారత్ న్యూస్ విజయవాడ…మొదటి ఫోటో,పేరు:- గుర్మిత రామ్ రహీమ్ సింగ్
నేరాలు: హత్యలు, మానభంగాలు, ఇతర క్రిమినల్ కేసులు
నేరాలు రుజువు కావడం తో 2017 ఆగస్ట్ లో హర్యానాలోని పంచకుల కోర్టు 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.
2017 నుండి ఇప్పటి వరకు 23 సార్లు పెరోల్ మీద పిక్నిక్ కి వచ్చినట్లు జైలు నుండి బయటకు రావడం. మళ్ళీ పని పూర్తి కాగానే మళ్ళీ జైల్ కు వెళ్లడం.
ఒక రకంగా చెప్పాలంటే జైలు నుండి బయటకు వచ్చేవాడు అనడం కంటే అప్పుడప్పుడు జైలుకు వెళ్ళేవాడు అనడం కరెక్ట్.,ఇది ఈ దేశ వ్యవస్థలు ఒక క్రిమినల్ కి ఇచ్చిన గౌరవం.
రెండో ఫోటో,పేరు : GN సాయి బాబా గారు
వృత్తి :- ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్
పోలియో కారణంగా రెండు కాళ్ళు చచ్చుబడిపోయి 90% అంగవైకల్యం తో వీల్ చైర్ కే పరిమితం
అభియోగం :- మావోయిస్టు రచనలను తన దగ్గర ఉంచుకున్నాడు అనే అభియోగం మోపి ఉగ్రవాదుల మీద పెట్టే దారుణమైన UAPA యాక్ట్ ని ఆయనపై పెట్టి Under trail ఖైదీ కింద దాదాపు 10 ఏళ్ళు ఘోరమైన అండ జైలు (ఉగ్రవాదులను ఉంచే) లో బంధించారు.
మా అమ్మ నేను పోలియో వల్ల కాళ్ళుతో నడవలేకపోయినా తన భుజాల ఎత్తుకొని రోజు బడికి తీసుకెళ్లి చదివించింది. నన్ను ఇంతవాడిని చేసింది. ఇప్పుడు ఆమె కాన్సర్ తో పోరాడుతూ చివరి క్షణాల్లో ఉంది నా తల్లిని చూడాలని ఉంది అని కోర్టుకు రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఆయనకు అనుమతి ఇవ్వలేదు.
కనీసం ఆ తల్లి చనిపోయిన తర్వాత కూడా చివరి చూపు చూడనివ్వవకుండా ఆయన్ను ఆ జైలులోనే ఉంచేశారు.
దాదాపు పదేళ్ల తర్వాత బాంబే హైకోర్టు సాయి బాబా మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు, ఆయన నిర్దోషి అని 2023 లో తీర్పు ఇస్తే, మహారాష్ట్ర ప్రభుత్వం, ఆయనను విడుదల చేయాలి అని ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలి అని సుప్రీం కోర్టుకు వెళితే, సుప్రీం కోర్టు ఆయన విడుదల పై స్టే విధించి. మళ్ళీ సుప్రీం కోర్టు మొదటి నుండి విచారణ జరిపి ఏడాది తర్వాత సుప్రీం కోర్టు కూడా ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని తీర్పు ఇస్తే, ఈ ఏడాది మార్చ్ లో ఆయన విడుదల అయ్యారు.
నేను నిర్దోషిని అని ఈ ప్రపంచానికి చాటి చెప్పి వ్యవస్థలు ఎన్ని హింసలు పెట్టిన ధైర్యంగా ఆ చీకటి గదిలో ఒంటరిగా పోరాడి, చివరకు నిర్దోషిగా విడుదల అయ్యి ఈ నెల 12 న తీవ్ర అనారోగ్యం తో తుదిశ్వాస విడిచారు.
ఇది ముమ్మాటికీ ఈ దేశం వ్యవస్థలు చేసిన హత్య. ఆయన చేయని తప్పుకు 10 ఏళ్ళు నష్టపోయారు. ఇప్పుడు ఆయన జీవితాన్నే నష్టపోయారు.
కానీ దీని అంతటికీ కారణం అయిన వాళ్లకు ఎలాంటి శిక్షలు లేవు./ఆ డేరా బాబా లాంటి వాళ్ళు క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి నేరాలు రుజువు అయ్యి జైలు శిక్షలు పడిన, కావాలనుకున్నపుడు బయటకు వస్తారు.
ఎలాంటి నేరాలు చేయని సాయి బాబా గారి లాంటి వాళ్ళు ఈ వ్యవస్థలు చేసిన హింసకు బలి ఐపోవాలా?
ఇదెక్కడి న్యాయం..!!??