భారత్ న్యూస్ విజయవాడ…రీల్స్ మోజులో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి: వీడియో వైరల్
యూపీలో ఓ మహిళ రీల్స్ మోజులో కన్న కూతురినే గంగలో వదిలేయడంతో ఆమె మరణించింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వారణాసికి చెందిన అంకిత తన కుమార్తె తాన్యతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గంగా నదికి వెళ్లింది. అక్కడ స్నానమాచరిస్తూ తాన్యను మరిచిపోయి నీటిలో వదిలేసింది.
ఆమె లోతైన నీటిలోకి వెళ్లి చనిపోయింది.
ఇదంతా గట్టుపై నుంచి వీడియో తీస్తున్న యువతి కూడా గమనించకపోవడం గమనార్హం.