..భారత్ న్యూస్ అమరావతి..దీపావళి వేళ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పుట్టపర్తిలో ఈమేరకు ఎస్పీ వి.రత్న ప్రకటన విడుదల చేశారు.
నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా లైసెన్సులు ఉన్నవారే విక్రయించాలని సూచించారు.
పండుగ వేళ ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలన్నారు.