.భారత్ న్యూస్ అమరావతి..సెక్షన్ 66A IT చట్టం ప్రకారం ఏ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయకూడదు : శ్రేయా సింఘాల్ తీర్పును అమలు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాలు
శ్రేయా సింఘాల్ కేసులో 2015లో రాజ్యాంగ విరుద్ధమని కోర్టు కొట్టివేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66A కింద ఎవరినీ ప్రాసిక్యూట్ చేయరాదని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. డైరెక్టర్ జనరల్స్‌కు కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 66A ప్రస్తావన అన్నింటి నుండి తీసివేయబడిందని నిర్ధారించడానికి అన్ని రాష్ట్రాల పోలీసు మరియు హోం సెక్రటరీలు…
భారత పౌరులు స్వేచ్చగా వారి యొక్క భావాలను వ్యక్తపరిచే “భావ వ్యక్తీకరణ” స్వేచ్ఛకు ఏలాంటి భంగం కలగకుండా ఉండేందుకు గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా న్యాయస్థానం ఇలాంటి తీర్పు ఇవ్వడానికి కారణం భారత రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ -19 (1) (A) నిర్దేశం.
ఈ సందర్భంగా భారతీయులమైన మనమంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి రుణపడి ఉన్నాము.
క్రింద గౌరవ సుప్రీంకోర్టు తీర్పు కాపీతో పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఉత్తరువు కాపీలను డౌన్లోడ్ చేసుకోగలరు.